Uday Kiran Songs - Veyi Kannulatho - Nee sneha Movie

Nee Sneham Songs - Veyi Kannulatho - Uday Kiran, Aarti Agarwal

వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకూ కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా
వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం

నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మా 
అందాల ఆకాశమా

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా

ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననె స్వప్నమేమి కానని
ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి మ్మ్.. ఒక్కసారి ల ల ల
ఒక్కసారి అయినా చెయ్యి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం

ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతూ లేనా
నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా
ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని

వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా